హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బ్యాంక్ సిబ్బందికి సైబర్ శిక్షణా కార్యక్రమం

విశాఖపట్నం నగరంలో మహారాజా కో-ఆపరేటివ్ బ్యాంక్ సిబ్బందికి సైబర్ శిక్షణా కార్యక్రమం ఆదివారం క్షత్రియ సంక్షేమ సమితిలో జరిగింది. వ్యవస్థాపక అధ్యక్షులు ఎం. రామకృష్ణం రాజు సిబ్బందికి సూచనలు ఇచ్చారు. సహకార శాఖ అధికారి త్రినాథ రావు కస్టమర్ల సంతృప్తిపై సూచనలు చేశారు. సైబర్ నిపుణులు ఆదిత్య వర్మ, సుధీర్ వర్మ శిక్షణ ఇచ్చారు. 13 బ్రాంచ్ మేనేజర్లు పాల్గొన్నారు.