NDL: శ్రీశైలం దేవస్థానంలో అన్నప్రసాద వితరణకు హైదరాబాద్‌కు చెందిన పి. మాధవరావు ఆదివారం రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు. ఈ మొత్తాన్ని ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో ఎం. శ్రీనివాసరావుకు అందించారు. ఈ సందర్భంగా దాతకు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అన్నప్రసాద వితరణకు రూ.10 లక్షల విరాళం


