హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తొలిరోజు ప్రశాంతంగా నామినేషన్ల స్వీకరణ

కడప జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. 13 మండలాల్లోని 67 క్లస్టర్ కేంద్రాల్లో తొలిరోజు సర్పంచ్ స్థానాలకు 285, వార్డు సభ్యుల స్థానాలకు 281 నామినేషన్లు దాఖలయ్యాయని వెల్లడించారు. ఈ నెల 16, 17 తేదీల్లో కూడా నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుందని తెలిపారు.