హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చేబ్రోలులో ఎన్నికలపై అవగాహన సదస్సు

ELR: ఉంగుటూరు మండలం చేబ్రోలులో, స్థానిక సంస్థల ఎన్నికలపై, అవగాహన సదస్సు జరిగింది. చేబ్రోలు ఎస్సై ఎం. సూర్య భగవాన్ సదస్సుకు హాజరై మాట్లాడారు. ఎన్నికల్లో శాంతి భద్రతలు పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.