విజయవాడ భవానీపురం హెచ్.బి. కాలనీలోని హెచ్‌ఐజీ గృహాలకు నాలుగు రోజులుగా నీటి సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. పైప్‌లైన్లు దెబ్బతినడంతో అధికారులు మరమ్మతులు చేపట్టినా సమస్య పరిష్కారం కాలేదు. రెండు రోజులుగా తక్కువ ఫోర్స్‌తో నీరు వస్తోందని స్థానికులు చెబుతున్నారు. సిబ్బందికి పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
విజయవాడలో తాగునీటి కష్టాలు


