హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిట్యాలకు రానున్న ఎమ్మెల్యే వేముల

NLG: చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో నూతన లబ్ధిదారులకు 'చేయూత పింఛన్' పంపిణీ కార్యక్రమం సోమవారం ఉదయం 10 గంటలకు వ్యవసాయ మార్కెట్ యార్డులో జరగనుంది. ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నూతన లబ్ధిదారులకు స్వయంగా పింఛన్ పత్రాలను అందజేస్తారు. లబ్ధిదారులు, నేతలు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి విచ్చేయాలని మున్సిపల్ ఛైర్ పర్సన్ పందిరి గీత కోరారు.