హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో పంచాయతీలకు 874 నామినేషన్లు దాఖలు

పల్నాడు జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తొలిరోజు ప్రశాంతంగా ముగిసింది. నరసరావుపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని 7 మండలాల్లో సర్పంచ్ పదవులకు 226, వార్డు సభ్యుల పదవులకు 648 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా వినుకొండ మండలంలో 50 సర్పంచ్ నామినేషన్లు, నూజెండ్ల మండలంలో 135 వార్డు సభ్యుల నామినేషన్లు నమోదయ్యాయి.