హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాళం వేసిన ఇంట్లో చోరీ!

NZB: నాగేపూర్‌లో తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ నెల 13న ఇంటికి తాళం వేసి వెళ్లిన పత్తి భూదేవి, 15న ఉదయం పక్కింటి వారి సమాచారంతో వచ్చి చూడగా తలుపులు తెరిచి ఉన్నాయి. ఇంట్లోని మూడు మాసాల చెవి కమ్మలు, నాలుగు తులాల వెండి ఆభరణాలు, నగదు అపహరణకు గురైనట్లు గుర్తించారు.