BPT: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఇంకొల్లు సీఐ రమా నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. చినగంజాం మండలం పెద్దగంజాంలో ఎస్సైలు వినోద్ బాబు, సురేష్, గోపి, సిబ్బందితో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. అనంతరం గ్రామస్థులతో సమావేశమై, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్


