కివీస్‌తో వన్డే సిరీస్‌లో భారత్ విజయం సాధించడంపై విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ హర్షం వ్యక్తం చేశాడు. ఈ విజయాన్ని అద్భుతమైనదిగా అభివర్ణించాడు. భారత ఆటగాళ్లు సమష్టిగా రాణించడం అభినందనీయమన్నాడు. ముఖ్యంగా బౌలర్లు ఒత్తిడిలోనూ అద్భుత ప్రదర్శన చేశారని ప్రశంసించాడు. న్యూజిలాండ్ వంటి జట్టుపై సిరీస్ గెలవడం భారత క్రికెట్‌కు ప్రత్యేక విజయమని పేర్కొన్నాడు.
క్రీడలు
టీమిండియా విజయం అద్భుతం: రాజ్‌కుమార్ శర్మ


