హైదరాబాద్: 28°C
క్రీడలు

WPL 2027 మ్యాచ్‌ల వేదిక మార్పు

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) ఐదో ఎడిషన్ జనవరి 14 నుంచి ఫిబ్రవరి 7 వరకు జరగనుంది. బ్రాబోర్న్ స్టేడియంలో జరగాల్సిన 11 మ్యాచ్‌లను వాంఖడేకు మార్చారు. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పిచ్‌లను సిద్ధం చేసేందుకు సమయం అవసరమవడంతో ఐసీసీ విజ్ఞప్తి మేరకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఎలిమినేటర్, ఫైనల్ కూడా వాంఖడేలోనే జరుగుతాయి.