MLG: లక్ష్మీదేవిపేటకు చెందిన కల్లుగీత కార్మికుడు మండ సాయిలు గౌడ్ ఈ నెల 4న తాటి చెట్టు నుంచి పడి నడుములో ఎముకలు విరిగి గాయపడ్డారు. ఆదివారం కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గుండెబోయిన రవిగౌడ్ ఆయనను పరామర్శించారు. నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా అందించాలని, తాటి చెట్లపై నుంచి పడి గాయపడిన కార్మికులకు నగదు రహిత వైద్యం కల్పించాలని కోరారు.
తెలంగాణ
‘గాయపడిన కల్లుగీత కార్మికుడికి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి’


