పాత గుంటూరులోని బాలాజీనగర్లో లిక్విడ్ గంజాయి విక్రయిస్తున్న 8 మంది యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 440 గ్రాముల లిక్విడ్ గంజాయి ఉన్న 44 ప్లాస్టిక్ టిన్లు, నాలుగు కూల్డ్రింక్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈస్ట్ DSP టి. సీతారాం పర్యవేక్షణలో సీఐ వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. గంజాయి విక్రయం, వినియోగం, సరఫరాపై ఉక్కుపాదం మోపుతామని DSP తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
డ్రగ్స్ దందా.. ఎనిమిది మంది అరెస్ట్


