హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన తహసీల్దార్

ASR: గూడెంకొత్తవీధి మండలం రింతాడ, పెదవలస నామినేషన్ కేంద్రాలను తహసీల్దార్ హెచ్. అన్నాజీ రావు ఆదివారం తనిఖీ చేశారు. రింతాడలో నాలుగు, పెదవలసలో రెండు గ్రామ పంచాయతీల నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ తీరుపై రిటర్నింగ్ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రెండు కేంద్రాల్లోనూ ప్రక్రియ సజావుగా సాగుతోందని అధికారులు తెలిపారు.