WG: పాలకొల్లు వైసీపీ మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా చందక ఉమా శైలజ ఎంపికయ్యారు. ఈ మేరకు పాలకొల్లు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుడాల గోపి సమక్షంలో ప్రభుత్వ మాజీ విప్ ముదునూరి ప్రసాద్ రాజు శైలజ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. గతంలో ఆమె 2 సార్లు కౌన్సిలర్‌గా పనిచేశారు. ఆమె భర్త ఏడాది కిందటి వరకు వైసీపీ పట్టణ అధ్యక్షుడిగా ఉన్నారు. కాగా ఆమె సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
పాలకొల్లు మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి ఖరారు


