WG: పాలకొల్లు 10వ వార్డుకు చెందిన పలివెల కిషోర్ ఇటీవల తుఫాను వేళ విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో సాయం చేస్తూ కరెంట్ షాక్తో మరణించారు. ఇచ్చిన మాట ప్రకారం మంత్రి నిమ్మల రామానాయుడు బాధిత కుటుంబానికి విద్యుత్ శాఖ తరఫున మంజూరైన రూ.5 లక్షల పరిహారాన్ని ఆదివారం అందజేశారు. పార్టీ బీమా కింద మరో రూ.5 లక్షలు ఇప్పించేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
బాధిత కుటుంబానికి మంత్రి నిమ్మల ఆపన్నహస్తం


