ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం టొంకిని సిద్ధి హనుమాన్ మందిరంలో జరిగిన సామూహిక హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణంలో ఆదివారం MLA హరీష్ బాబు పాల్గొన్నారు. మంచిర్యాలకు చెందిన భక్త బృందంతో కలిసి MLA హనుమాన్ చాలీసా చదివి భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
సామూహిక హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొన్న MLA


