సత్యసాయి: ధర్మవరం పట్టణంలోని జడ్పీ బాయ్స్ హైస్కూల్ మైదానంలో ఆదివారం జిల్లా స్థాయి పారా స్పోర్ట్స్ ఎంపికలు నిర్వహించారు. 6 క్రీడా విభాగాల్లో జరిగిన పోటీలకు జిల్లా నలుమూలల నుంచి 60 మంది దివ్యాంగ క్రీడాకారులు హాజరయ్యారు. ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి బి. కిషోర్ రాజు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ధర్మవరంలో జిల్లా స్థాయి పారా స్పోర్ట్స్ ఎంపికలు


