హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమంగా మొరం తరలిస్తున్న ట్రాక్టర్లు సీజ్

WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులోని ఎస్సారెస్పీ కెనాల్ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా మొరం తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు వర్ధన్నపేట SI ప్రవీణ్ తెలిపారు.