హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంటికే RC, డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు!

VSP: ఏపీలో వాహనదారులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. పెండింగ్ RC, DL కార్డుల పంపిణీకి రవాణా శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎల్లుండి నుంచి కార్డులను పోస్టు ద్వారా నేరుగా వాహనదారుల ఇళ్లకే పంపించనున్నారు. 2024 అక్టోబర్ నుంచి 2026 ఆగస్టు వరకు పెండింగ్ లో ఉన్న మొత్తం 39.60 లక్షల RC, DL కార్డులు పంపిణీ చేయనున్నారు. ఇక ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు.