హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పరిసరాలను శుభ్రం చేయించిన కమిషనర్

సత్యసాయి: హిందూపురం చౌడేశ్వరి కాలనీలో జాతీయ జెండా పరిసరాలు పిచ్చిమొక్కలు, పొదలతో నిండిపోవడాన్ని గమనించిన మున్సిపల్ కమిషనర్ వి. మల్లికార్జున వెంటనే స్పందించారు. మున్సిపల్ సిబ్బందితో వాటిని తొలగించి పరిసరాలను శుభ్రం చేయించారు. జాతీయ జెండా దేశ గౌరవానికి ప్రతీక అని, దాని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు.