హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పంచాయతీ ఎన్నికల నామినేషన్లకు పటిష్ట భద్రత'

ATP: జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. 13 మండలాల్లోని నామినేషన్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా ఎస్పీ పి. జగదీష్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.