హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్తీక మాసంతో మార్కాపురం బస్టాండ్‌లో రద్దీ

ప్రకాశం: కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలం వెళ్లే భక్తులతో మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ ఆదివారం రద్దీగా మారింది. అయితే సరిపడా బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కార్తీక మాసం ముగిసే వరకు శ్రీశైలం మార్గంలో అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు.