హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా 39వ కోతకాలపు పండుగ

కృష్ణా: మచిలీపట్నం నోబుల్ మిషనరీ సీఎస్ఐ చర్చిలో 39వ కోతకాలపు పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు తొలి పంటలో దశమ భాగాన్ని దేవునికి సమర్పించారు. డాక్టర్ కె. ఎడ్విన్ సుధాకర్ దైవ సందేశం అందించారు. చర్చి ప్రాంగణంలో 26 స్టాళ్లు ఏర్పాటు చేశారు. మేయర్ షేక్ అబ్దుల్ అబిదా, కార్పొరేటర్ పిట్టా సౌమ్య తదితరులు పాల్గొన్నారు.