హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముగిసిన భారత్-మయన్మార్ నావికా విన్యాసాలు

విశాఖపట్నం వేదికగా జరిగిన 8వ భారత్-మయన్మార్ నావికా విన్యాసాలు (IMNEX-26) హార్బర్ ఫేజ్ ముగిసింది. ఈ విషయాన్ని భారత నౌకాదళం ఆదివారం వెల్లడించింది. ఈ దశలో ఇరు దేశాల నౌకాదళ అధికారులు సమావేశాలు, నిపుణుల చర్చలు, క్రాస్ డెక్ సందర్శనలు, క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. భారత నౌకలు ఐఎన్ఎస్ రాణా, సుమేధ, మయన్మార్ నౌక యూఎంఎస్ కింగ్ సిన్ ఫ్యూ షిన్ పాల్గొన్నాయి.