హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖ సదస్సు సక్సెస్

విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరైన భారత ఉపరాష్ట్రపతి, ఆరుగురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. తమ శాఖల ద్వారా కేంద్ర మంత్రులు రాష్ట్రానికి పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చి, పెట్టుబడిదారుల్లో అపారమైన నమ్మకాన్ని పెంచారని సీఎం కొనియాడారు. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి కేంద్రం మద్దతు ఇవ్వడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.