హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సిద్దవటంలో తొలి రోజు 54 నామినేషన్లు

KDP: సిద్దవటం మండలంలోని 18 గ్రామ పంచాయతీలకు ఐదు క్లస్టర్లలో ఆదివారం నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. తొలిరోజు సర్పంచ్ స్థానాలకు 27, వార్డు సభ్యుల స్థానాలకు 27 నామినేషన్లు దాఖలైనట్లు ఎంపీడీవో ఫణి రాజకుమారి తెలిపారు. పోలీసుల పర్యవేక్షణలో నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగింది.