హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీలో చేరిన 150 కుటుంబాలు

NLR: కోవూరు నియోజకవర్గాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి.. రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి తెలిపారు. ఆదివారం 150 పైగా కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు.