హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి అభ్యర్థి భారీ నామినేషన్ ర్యాలీ

VSP: తుమ్మపాలలో సర్పంచ్ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. కూటమి మద్దతుతో బరిలో నిలిచిన ఆడారి జగదీశ్వరి గోవిందరావు నామినేషన్ ర్యాలీ ఆకర్షణగా నిలిచింది. ఏలేరు కాలువ నుంచి ప్రధాన వీధుల మీదుగా సాగిన ర్యాలీలో సుమారుగా మూడు వేల మంది పాల్గొన్నారు. గ్రామ పెద్దలు, మహిళలు, యువత హాజరయ్యారు. వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. ఈ జనసందోహం ఓట్లలో ఎంత ప్రతిఫలిస్తుందో చూడాలి.