హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఒకచోట ప్రశాంతం.. మరోచోట ఉద్రిక్తత.!

అన్నమయ్య: కడప జిల్లాలోని బద్వేల్, రాజంపేట నియోజకవర్గాల్లో సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోంది. అయితే అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో మాత్రం ఉద్రిక్తత నెలకొంది. రాయచోటి, రామాపురంలో ఇరువర్గాలు రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులకు దిగడంతో పలువురికి గాయాలయ్యాయి. దీంతో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.