హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తుపాన్ల దెబ్బకు అధ్వానంగా రహదారులు

WG: వరుస తుపాన్లు, భారీ వర్షాలు, వరదలతో జిల్లాలో రహదారులు అధ్వానంగా మారాయి. ప్రధాన రహదారులపై భారీ గుంతలు ఏర్పడి, వాననీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అర్నబ్‌ తుపాను గాలులకు 138 చోట్ల చెట్లు కూలిపోగా, 71 రహదారులు ముంపునకు గురయ్యాయి. మరమ్మతులకు అధికారులు అంచనాలు సిద్ధం చేశారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తేనే రహదారుల పరిస్థితి మెరుగుపడనుంది.