హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రావివలస నుంచి టీడీపీలోకి 20 కుటుంబాలు

VZM: చీపురుపల్లి మండలం రావివలస పంచాయతీ పైలపేట, కొత్తపేట గ్రామాల సుమారుగా 20 కుటుంబాలు టీడీపీలో చేరాయి. జడ్పీటీసీ వలిరెడ్డి శ్రీనివాసనాయుడు ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి. సీఎం చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి చేరినట్లు తెలిపారు. ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు నాయకత్వంలో పనిచేస్తామన్నారు. క్యాంప్ కార్యాలయంలో నాయకుల సమక్షంలో కండువాలు కప్పి ఆహ్వానించారు.