హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జ్యోతి యర్రాజీకి అర్జున అవార్డు

విశాఖపట్నానికి చెందిన 27 ఏళ్ల హర్డిల్స్ క్రీడాకారిణి జ్యోతి యర్రాజీ అర్జున అవార్డు అందుకున్నారు. గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ అభినందనలు తెలిపారు. ఇది రాష్ట్రానికి గర్వకారణమైన క్షణమని ఏపీ లోక్ భవన్ ఎక్స్ పేర్కొంది. 100 మీటర్ల హర్డిల్స్ లో జాతీయ రికార్డు నెలకొల్పిన జ్యోతి 2024 పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొన్నారు. ఆమె విజయాలు యువతకు స్ఫూర్తిదాయకమన్నారు.