హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గిరిజన ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో గుర్తింపు

ASR: గిరిజన ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో గుర్తింపు, ఉత్పత్తిదారులకు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించడమే లక్ష్యమని GCC చైర్మన్ శ్రావణ్ కుమార్ తెలిపారు. విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఆది బజార్‌ ఆదివారం ప్రారంభించారు. ఈనెల 15నుంచి 24వరకు 10రోజుల పాటు నిర్వహించే ఈ బజార్‌లో గిరిజనుల సంప్రదాయ హస్తకళలు, చేనేత వస్త్రాలు ప్రదర్శించి విక్రయించనున్నారు.