హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్టీఆర్ బీచ్ వద్ద విషాదం.. విదేశీయుడు మృతి

KKD: సెలవు దినం కావడంతో నైజీరియాకు చెందిన కొందరు యువకులు కాకినాడలోని ఎన్టీఆర్ బీచ్‌కు వెళ్లారు. సరదాగా సముద్రంలో స్నానానికి దిగిన వారిలో ఓ యువకుడు అలల తాకిడికి గల్లంతయ్యాడు. కొద్దిసేపటి తర్వాత అతని మృతదేహం లభించింది. మృతుడు స్థానికంగా ఉన్న ఓ విద్యాసంస్థలో చదువుకుంటున్నట్లు సమాచారం. ఈ ఘటనతో బీచ్ వద్ద విషాదం నెలకొంది.