CTR: సోమల మండలం బోనమంద అటవీ ప్రాంతంలో ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందాడు. అటవీ ప్రాంతం నుంచి కలపను తరలిస్తున్న ట్రాక్టర్ ఆదివారం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ట్రాక్టర్ కింద పడిన డ్రైవర్ గోవింద్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు పెద్దపంజాణి మండలం రాయలపేటకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్
ట్రాక్టర్ కిందపడి డ్రైవర్ దుర్మరణం


