KRNL: కౌతాళం మండలం ఎరిగేరి గ్రామానికి చెందిన దళిత రైతు హనుమంతు పొలంలో మిరప పంటను ధ్వంసం చేయడంతో పాటు రెండు మోటార్లు, పైపులను నరికివేశారు. కులం పేరుతో దూషించి బెదిరించిన వారే ఈ ఘటనకు పాల్పడినట్లు రైతు సంఘం నాయకులు మల్లయ్య ఆరోపించారు. సుమారు రూ.6 లక్షల నష్టం వాటిల్లినట్లు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని బాధిత రైతుకు నష్టపరిహారం అందించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎరిగేరిలో దళిత రైతు మిరప పంట ధ్వంసం


