కడప జిల్లాలో ఖరీఫ్ 2026-27 సీజన్‌కు సంబంధించి 19 మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా తెలిపారు. గ్రేడ్-ఏ ధాన్యానికి క్వింటాల్ రూ.2,461, సాధారణ రకానికి రూ.2,441 మద్దతు ధర నిర్ణయించామన్నారు. రైతులు దళారులను నమ్మకుండా ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో 19 మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు


