హైదరాబాద్: 28°C
వార్తలు

బ్రేకులు పనిచేయకుండానే 463 కి.మీ. ప్రయాణం

సరైన బ్రేక్ పవర్ లేని ఓ ఖాళీ వందే భారత్ రైలును గూడ్స్ ఇంజిన్‌తో 463 కి.మీ మేర తరలించడం తీవ్ర కలకలం రేపింది. హతియా - ఝాన్సీకి తరలిస్తుండగా బ్రేకులు పనిచేయట్లేదని లోకోపైలట్లు ఫిర్యాదు చేసినా అధికారులు నిర్లక్ష్యం వహించారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్టేషన్‌లో తనిఖీ చేయగా కోచ్‌ల బ్రేకింగ్ సిస్టమ్ ఐసొలేట్ చేసినట్లు తేలింది. దీనిపై రాంచీ DRMను విచారణకు ఆదేశించారు.