హైదరాబాద్: 28°C
వార్తలు

భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య!

కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. సంతానం కలగడం లేదంటూ భర్త రాజశేఖర్‌ నిత్యం మద్యం తాగి భార్య మాలాశ్రీని వేధించేవాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన మాలాశ్రీ కత్తితో భర్తపై దాడి చేసింది. తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలిస్తుండగా రాజశేఖర్‌ మృతిచెందాడు. పోలీసులు భార్యను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.