హైదరాబాద్: 28°C
వార్తలు

భారీ కూంబింగ్.. రూ.30 లక్షల రివార్డు

జమ్ముకశ్మీర్‌లోని దచ్ఛన్, మడ్వా అటవీ ప్రాంతాల్లో ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు భారీ కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈనెల 11న ఇద్దరు SPOల హత్య నేపథ్యంలో సైన్యం, CRPF, SOG సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. హెలికాప్టర్లు, డ్రోన్లు, జాగిలాలతో విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ముగ్గురు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల చేసి, ఆచూకీ చెబితే రూ.30 లక్షల రివార్డు ప్రకటించారు.