KMM: కల్లూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రేపు ఉదయం 11 గంటల నుండి ప్రజావాణి కార్యక్రమం మొదలవుతుందని అన్నారు. డివిజన్ స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలన్నారు.
తెలంగాణ
రేపు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి


