హైదరాబాద్: 28°C
వార్తలు

ఆకలికి తట్టుకోలేక కుక్క కళేబరం తిన్నాడు!

ఒడిశాలోని సంబల్‌పూర్‌లో ఓ మానసిక వైకల్యంతో బాధపడుతున్న వ్యక్తి చేసిన పని కలకలం రేపింది. తీవ్ర ఆకలితో ఉన్న ఆ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కుక్క కళేబరాన్ని తిన్నాడు. మనేశ్వర్ చౌక్ వద్ద జరిగిన ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడియో వైరల్ కావడంతో స్పందించిన స్థానికులు ఆ వ్యక్తికి తక్షణమే పునరావాసం, వైద్యం, ఆహారం అందించాలని కోరుతున్నారు.