హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనధికార సభలపై పోలీసుల ఆంక్షలు: సీపీ

NZB: జిల్లా కమిషనరేట్ పరిధిలో నవంబర్ 16 నుంచి 30 వరకు పలు నిబంధనలు అమలు చేయనున్నట్లు సీపీ సాయి చైతన్య ఆదివారం తెలిపారు. అనుమతి లేకుండా విగ్రహాల ఏర్పాటు, అధిక శబ్దంతో డీజేలు, అనధికార సభలు, డ్రోన్ల వినియోగంపై ఆంక్షలు విధించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం నిషేధమని, ఫేక్ గల్ఫ్ ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.