కార్తీక మాసం వేళ సంగమేశ్వరం, సోమశిల క్షేత్రాలకు భక్తుల తాకిడి పెరిగింది. 8 నెలలు జలగర్భంలో ఉండి, వర్షాభావంతో అక్టోబర్లోనే వెలుగులోకి వచ్చిన సంగమేశ్వరుడిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి శివభక్తులు తరలివస్తున్నారు. కృష్ణానదిలో బోటు ప్రయాణం చేస్తూ ప్రకృతి అందాల నడుమ పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. సోమశిలలో జ్యోతిర్లింగాలను దర్శించుకుంటూ యాత్రను కొనసాగిస్తున్నారు.
వార్తలు
సంగమేశ్వరం, సోమశిల క్షేత్రాలకు భక్తల తాకిడి


