హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు: ఎంపీ

WGL: పర్వతగిరి మండలం చింతనెక్కొండలో ఆదివారం నిర్వహించిన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందిస్తామన్నారు. మహిళలకు వయసుతో సంబంధం లేకుండా ప్రత్యేక చీరల పంపిణీ కొనసాగుతోందని తెలిపారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాలతో పేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.