హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు ఐటీడీఏ కార్యాలయంలో గిరిజన దర్బార్

BDK: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించే గిరిజన దర్బార్‌కు అన్ని శాఖల యూనిట్ అధికారులు సకాలంలో హాజరుకావాలని పీవో బి.రాహుల్ తెలిపారు. గిరిజనులు తమ సమస్యలను నేరుగా లిఖితపూర్వకంగా అందజేయాలని సూచించారు. ఉదయం 10.30 గంటలకు సమావేశ మందిరంలో అర్జీలను పరిష్కరించాలని ఆదేశించారు.