హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అల్లూరులో రెండో రోజూ ఒక్క నామినేషన్ లేదు!

NLR: అల్లూరు నగర పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ రెండో రోజు కూడా ఒక్క నామినేషన్ దాఖలు కాకుండానే ముగిసింది. మొదటి రోజు కూడా నామినేషన్లు దాఖలు కాలేదు. మరోవైపు నగర పంచాయతీ వద్దు.. గ్రామ పంచాయతీ ముద్దు అంటూ మూడు గ్రామాల ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. నామినేషన్ల దాఖలుకు రేపే చివరి రోజు కావడంతో అల్లూరు రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.