హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపటి నుంచి తిరుమల మ్యూజియం సందర్శన

TPT: తిరుమల ఆధునీకరించిన శ్రీ వేంకటేశ్వర మ్యూజియం నవంబర్ 16 నుంచి భక్తులకు అందుబాటులోకి రానుంది. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు అంతస్తులుగా రూపుదిద్దుకున్న ఈ మ్యూజియంలో 14 ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. భక్తులు ప్రతిరోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రూ.50 ప్రవేశ రుసుముతో మ్యూజియాన్ని సందర్శించవచ్చని టీటీడీ తెలిపింది.