హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేకాట ఆడుతున్న ఏడుగురి అరెస్ట్

ప్రకాశం జిల్లా కురిచేడు మండలం బోధనంపాడు గ్రామంలో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో కురిచేడు ఎస్ఐ సిబ్బందితో కలిసి దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.20,500 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామాల్లో పేకాట, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.